ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వంలేని మనిషని శానసమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. టిడిపి నాయకులు సురేష్ నాయుడు ఆర్థిక సహకారంతో ఏర్పాటైన అన్న క్యాంటీన్‌ను బుధవారం యనమల ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీవ్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సిఎం జగన్ తన స్వార్థపు ఆలోచనలతో ఇప్పటికే ఖజానా ఖాళీ చేశాడన్నారు. ఇందుకు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. టిడిపి హయాంలో పేదలకు అన్నంపేట్టేందుకు ప్రారంభించిన ఆన్న క్యాంటీన్లను ప్రభుత్వం వచ్చాక నిర్దాక్షిణ్యంగా మూసివేసి పేదలను ఆకలితో అలమటించేవిధంగా చేసిందన్నారు. జగన్ చరిత్ర చూస్తే అతను క్రిమినల్ అన్నది అర్థమైపోతుందన్నారు. జగన్ ఎంపీ కాక ముందుకు రూ.లక్ష కోట్టు దోచేశాడన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం టిడిపి ప్రభుత్వం వస్తుందని జగన్‌కు తప్పకుండ శిక్ష పడుతుం దన్నారు. దొంగ ఓట్లపైన ఆశపెట్టుకున్న జగన్‌కు సరైన గుణపాఠం కడప జిల్లా నుండే మొదఃలవుతుందని పేర్కొన్నారు. మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం గురించి తొలుత ఆలోచ నచేసింది టిడిపినే అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి, టిడిపి నాయకులు వరద రాజులరెడ్డి, అమీర్‌బాబు, సురేష్ నాయుడు, లింగారెడ్డి మాట్లాడుతూ మళ్లీ టిడిపికి పూర్వ వైభవం తప్పదన్నారు. సురేష్‌నాయుడుకు పోటీగా ఎమ్మెల్యే రాచమల్లు క్యాంటీన్‌ను త్వరలో ప్రారం భిస్తున్నారని తెలిసిందని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్న యనమల










