నజీర్ కుటుంబానికి డబ్బు అందిస్తున్న దృశ్యం
మానవత్వం చాటుకున్న మిత్ర బృందం
ప్రజాశక్తి - పాణ్యం
కలిసి చదువుకొని తరువాత జీవిత గమనంలో ఎవ్వరి జీవితాలు వారు చూసుకుంటున్న నేటి సమాజంలో తమతో కలిసి చదువుకొని, తిరిగిన మిత్రునికి ఆర్థిక సాయం అందించి మిత్ర బృందం దాతృత్వం చాటుకుంది. పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న మిత్రులలో ఒకరికి పక్షవాతంతో బాదపడుతున్న స్నేహితుడికి అతనికి ఆ మిత్ర బృందం రూ.40, 000 నగదు సాయం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుఖాల్లో కాదు కష్టాల్లో కూడా తోడు నిలవాలని మిత్ర బృందం సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రబృందం సభ్యులు వేణు,విజరు,చిన్నన్న,శివ, మల్లికా ర్జున్, మని, రాజు, శ్రీను, గోపి అయ్య,రతీష్,రమేష్,రఘు పాల్గొన్నారు.










