Sep 19,2022 23:29

అపరిచిత వృద్ధురాలికి సపర్యలు చేస్తున్న హోంగార్డు

ప్రజాశక్తి- పెందుర్తి : ఒక పక్క విధులను నిర్వర్తిస్తూనే, మరోపక్క అనాథలా పడి ఉన్న అపరిచిత వృద్ధురాలికి సపర్యలు చేయడం ద్వారా హోంగార్డు కళ తన మానవత్వాన్ని చాటుకుంది. రెండు రోజులుగా కురుస్తునన వర్షాలకు వేపగుంట కూడలిలో ఒక వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో పడి ఉంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ కూడలిలో సోమవారం విధుల నిర్వహణకు వచ్చిన హోంగార్డు కళ, వృద్ధురాలి దుస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. ఆమె వద్దకు వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా సరిగా చెప్పలేకపోవడంతో అక్కడున్న వారిని ఆరా తీసింది. ఎటువంటి సమాచారం రాకపోవడంతో రోడ్డుపైనే పడిఉన్న వృద్ధురాలిని పక్కనే ఖాళీగా ఉన్న షెడ్‌లోకి తీసుకెళ్లి సపర్యలు చేసింది. తనవంతుగా కొంత నగదు సాయాన్ని కూడా అందించింది. వృద్ధురాలికి ఎవరైనా అండగా నిలిచి ఆదుకోవాలని, లేదంటే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించాలని హోంగార్డు కళ అర్థిస్తోంది.