- సీఐను అభినందించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
- రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సపర్యాలు
- క్షతగాత్రులను పోలీస్ వాహనంలో వైద్యశాలకు తరలింపు
ప్రజశక్తి - చీరాల
రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పట్ల ఒకటో పట్టణ ఇన్చార్జి సీఐ సోమశేఖర్ మానవత్వాన్ని చాటుకుటన్నారు. వారికీ సపర్యాలు చేశారు. వారిని పోలీసు వాహనంలోనే చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం చీరాలలోని పేరాల - వాడరేవు రోడ్డులో ఆటో - ద్విచక్రవాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రేపల్లె మండలం పెటేరు గ్రామానికి చెందిన జె శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సమయంలో అటుగా విధుల్లో భాగంగా వెలుతున్న చీరాల రెండో పట్టణ సీఐ జి సోమశేఖర్ వెంటనే స్పందించారు. క్షతగాత్రులను తన పోలీస్ వాహనంలో ఎక్కించుకుని హుఠాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సీఐతోపాటు సహకరించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. ప్రస్తుత జీవన విధానంలో ప్రజలు ఏదైనా రోడ్డు ప్రమాదం చూసినా పట్టించుకోనట్లు వెళ్లిపోతున్నారని అన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటన్ చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్ట ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని మొదటి గంటలో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని గుడ్ సమారిటన్ గా గుర్తించి తగిన పారిదోషకం అందించబడుతుందని అన్నారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ప్రమాదాలు జరిగిన వారిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు.










