
ఆమె మృతికి పలువురి సంతాపం
ప్రజాశక్తి - ఆచంట
ఆచంటకు చెందిన ప్రముఖ దాత, మనవతావాది నెక్కంటి శశిరేఖ (78) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆచంట గ్రామంలోని పలు దేవాలయాలకు ఆమె పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. మండలంలోని పెనుమంచిలిలో ఇటీవల నిర్మించతలపెట్టిన కాపు కళ్యాణ మండపానికి 50 సెంట్ల భూమిని విరాళంగా అందించి తన దాతృత్వాన్ని నిరూపించుకున్నారు. ఆమె భర్త నెక్కంటి సూర్య వెంకట సుబ్బారావు ఆచంటలో మృత్యుంజయ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆమె చిన్న కుమారుడు టిడిపిలో పలు పదవులు నిర్వహించారు. ఆమె అకాల మృతి పట్ల గ్రామస్తులతో పాటు పలువురు టిడిపి, వైసిపి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. శశిరేఖ మృతి పట్ల మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు ఉప్పలపాటి సురేష్‌బాబు, మాజీ సర్పంచి గొడవర్తి శ్రీరాములు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.