May 31,2023 01:23
బహుమతులు అందుకుంటున్న కళాకారులు

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ నాటిక పోటీలు మానవతా విలువలను చాటి చెప్పాయి. నటీనటులు తమ నటన ద్వారా అద్భుతమైన ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారు. 7వ జాతీయ స్థాయి పోటీలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు రావటంతో కళాప్రాంగణం కిటకిటలాడింది. బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది. సభకు చిట్టినేని సాయిబాబు అధ్యక్షత వహించారు. ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్‌ గుంటూరు వారి అతీతం అనే నాటిక ఎంపికై ప్రథమ బహుమతి సాధించింది. హేలాపురి కల్చరల్‌ అసోసియేషన్‌ ఏలూరి వారి మనసున మనసై ద్వితీయ బహుమతి సాధించింది. పొన్నూరు వారి రసఝరి 'గుర్తుతెలియని శవం' నాటిక తృతీయ ప్రదర్శనగా ఎంపికైంది. న్యాయమూర్తులుగా నుసుము నాగభూషణం, జెట్టి హరిబాబు వ్యవహరించారు. కార్యక్రమంలో కొల్లా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.