ఘనంగా మదర్ థెరిస్సా 113వ జయంతి
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
మదర్ థెరిస్సా 113వ జయంతి సందర్భంగా శనివారం జిల్లా రెడ్‌క్రాస్ కార్యాలయంలోని మదర్ థెరిస్సా విగ్రహానికి రెడ్‌క్రాస్ ఛైర్మన్ బివి కృష్ణారెడ్డి, ఏలూరు యూనిట్ మానవత ఛైర్మన్ అడుసుమిల్లి నిర్మల, ప్రెసిడెంట్ మేతర అజరు బాబు, లయన్స్ క్లబ్ జోనల్ ఛైర్మన్ శ్రీనివాస్, రోటరీక్లబ్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మన్ బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటికీ అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పడ్డాయి అంటే దానికి ముఖ్య కారణం భారతరత్న మదర్ థెరిస్సా చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకోవడమేనని తెలిపారు. మానవత ఏలూరు మండల యూనిట్ ఛైర్మన్ అడుసుమిల్లి నిర్మల మాట్లాడుతూ నేడు అనేకమంది సహాయ కార్యక్రమాలు చేస్తున్నారంటే దానికి కారణం మదర్ థెరిస్సా అని, మదర్ థెరిస్సా సేవా మార్గంలో, మానవత సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ధన సహాయం చేయడం, తలసేమియా పిల్లలకు ఉచిత భోజనం పంపిణీ, పేద కుటుంబాలు ఆదుకోవడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని రోగులకు రొట్టెలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కార్యదర్శి బి.బెన్ని, మానవత సభ్యులు అడుసుమిల్లి నిర్మల, మేత అజరు బాబు, లైన్స్ క్లబ్ సభ్యులు శ్రీనివాస్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.










