
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లుకు చెందిన అత్యం ఆదిశేషారావు తన తల్లిదండ్రులు కీర్తిశేషులు అత్యం సుబ్బారావు, వసంత కనక కామేశ్వరమ్మ జ్ఞాపకార్థం మానవత విద్యానిధికి రూ.25 వేల విరాళం అందించారు. పాలకొల్లు మండల కోశాధికారి మద్దాల వాసుకు ఆదివారం చెక్కు అందించారు. పాలకొల్లు మండల కన్వీనర్ ముత్యాల రామారావు మాట్లాడుతూ ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి సహకరించేందుకు మానవత విద్యానిధి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్, రేపూరి సూర్యనారాయణ, విన్నకోట వెంకటరమణ, బేబి పాల్గొన్నారు.