జంగారెడ్డిగూడెం:ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మి అన్నారు. శనివారం మానవత స్వచ్ఛంధ సేవా సంస్థ జిల్లా రక్తనిధి ఛైర్మన్ అయినాల రమణమూర్తి(మానవత మూర్తి) ఆధ్వర్యంలో 29వ వార్డు బాలాజీనగర్ పాఠశాల ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఏలూరు శంకర నేత్రాలయ, గుడ్ సమరిటన్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మున్సిపల్ నాగలక్ష్మి ప్రారంభించారు. మేడవరపు విద్యాసాగర్ నేత్ర వైద్య విభాగాన్ని ప్రారంభించారు. ఆనంతరం నాగలక్ష్మి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాల వల్ల సామాన్య ప్రజలకు ఎంతోమేలు చేకూరుతుందన్నారు. ఈ శిబిరాలను ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. క్యాంపు ఆర్గనైజర్ చిటికెన రాంబాబు మాట్లాడుతూ వైద్యులు సోనిక, ఆదిత్య, బాషా వైద్య సేవలందించారన్నారు. సుమారు 279 మంది మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఈ వైద్య సేవలను ఉపయోగించుకున్నారని తెలిపారు. 36 మందికి కంటి ఆపరేషన్లకు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా కన్వీనర్ త్రిపురసుందరి, మండల అధ్యక్షులు డికె.రెడ్డి, మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ, చింతా అనిల్‌కుమార్, సంకు సురేష్, మైరెడ్డి జగదీష్, నెలప్రోలు ప్రభాకర్ పాల్గొన్నారు.










