ప్రజాశక్తి - కలిదిండి
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా స్థానిక కలిదిండి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి తహశీల్దారు కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సర్పంచి ఎం.మారుతీ ప్రసన్న జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. జెడ్‌పిటిసి బొర్రా సత్యవతి, వైస్ ఎంపిపి కట్టా నాగలక్ష్మి, సర్పంచి సానా మీనా సరస్వతి, కరెస్పాండెంట్ ఎస్‌వి రామారావు, మానవత సంస్థ ఛైర్మన్ పేటేటి వివేకానంద, అధ్యక్ష, కార్యదర్శులు సత్యన్నారాయణ, జగన్, కోశాధికారి చెన్నంశెట్టి కృష్ణ, వూర శ్రీథర్, మారుబోయిన రత్నారావు, నల్లూరి పెద్దిరాజులు, నరసింహారావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










