Dec 03,2022 23:24

మాట్లాడుతున్న సర్పంచ్‌, సంస్థ సభ్యులు

ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని కొర్రాయి పంచాయతీ బొందుగుడ గ్రామంలో సర్పంచ్‌ పూజారి కొములు ఆధ్వర్యంలో ప్రపంచ హ్యూమన్‌ రైట్స్‌ సంఘం ఆధ్వర్యాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ఆర్‌.బాలారాజు, మదుబాబు మాట్లాడుతూ, రాజ్యాంగం లో కల్పించిన మానవ హక్కుల పై గిరిజనులకు అవగాహన సదస్సు కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ఆ సంఘ నాయకులు క్రిష్ణ గౌడ్‌, రంజిత్‌ గౌడ్‌, బురిడీ విక్రమ్‌ దేవ్‌, సన్యాసి నాయుడు, సరీప్‌ నిసమ్మ, కే సునిల్‌ కుమార్‌, ఎ.వైకుంఠం పాల్గొన్నారు.