
ప్రజాశక్తి పుట్టపర్తి క్రైమ్ : మానవ అక్రమ రవాణా పై వాక్ ఫర్ ఫ్రీడమ్ ర్యాలీ రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పుట్టపర్తి పట్టణంలో కలెక్టరేట్ నుంచి సత్యమ్మ గుడి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దిశా డీఎస్పీ వరప్రసాద్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ లక్ష్మి కుమారి, మహిళా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ నరసయ్య హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈసందర్భంగా రెడ్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ భానుజా మాట్లాడుతూ రెడ్స్ స్వచ్చంద సంస్థ, జిల్లా గ్రామీణ అభి వద్ధి సంస్థ దిశా పోలీస్ మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా, మూమెంట్ గ్లోబల్ ఫౌండేషన్ (ది మూమెంట్ ఇండియా) వారి సహకారంతో జిల్లాలో మానవ అక్రమ రవాణా నిరోధానికి కృషి చేస్తున్నామన్నారు. పీడీ నరసయ్య మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా ఒక సామాజిక సమస్య దీనిని అరికట్టడానికి పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీపీస్ రెడ్స్ సిబ్బంది పాల్గొన్నారు.