మానవ అక్రమ రవాణాపై అవగాహన
ప్రజాశక్తి-కావలి : మూమెంట్ ఇండియా సూచనల మేరకు శుక్రవారం ''ప్రియదర్శిని మహిళా మండలి'' అధ్యక్షురాలు షేక్.ఖాదర్‌బీ ఆధ్వర్యంలో కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం, (కెజిబివి) ముసునూరులో ''మానవ అక్రమ రవాణా''పై విద్యార్థినులకు అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా జరుగుతున్న విధానంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, బాలికలు మొదటి ప్రయారిటీ, నైతిక విలువలు, బాల్య వివాహాలు, విద్య ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. తల్లిదండ్రుల ముఖ్యపాత్ర, ఈ సమాజంలో ఆడపిల్లలు చదువు తోపాటు వాళ్లను వాళ్లు రక్షించుకునే విధంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. రవాణా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం పేరుతో రకరకాలుగా మనుషులను ప్రలోభపెట్టి, మానవ అక్రమ రవాణా చేయించడం, వారి నుండి అవయవాలను తీసుకోవడం వారిని వ్యభిచార గృహాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యంగా బాలికలు అప్రమత్తంగా ఉండాలని కస్తూర్భా విద్యాలయం బాలికలకు అవగాహన కల్పించారు. యువత మార్గదర్శకాలను చూసుకొని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తదుపరి మానవ అక్రమ రవాణాకు సంబంధించిన, ఫ్ల కార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యార్థినులు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ డి.మంజులదేవి, స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, స్వచ్ఛంద సంస్థల, నిర్వాహకులు రాయపాటి దిలీప్ కుమార్, జమీర్, ప్రసాదరావు, సురేంద్ర, బ్రహ్మయ్య, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.










