ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక ప్రపంచ దినం సందర్భంగా శుక్రవారం స్థానిక మహిళా ప్రాంగణంలో గిరిజన గురుకుల బాలికల వసతిగృహంలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.చంద్రమౌలీశ్వరి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, శిక్షలు గురించి వారికి అవగాహన కల్పించారు. మహిళలుగానీ, బాలికలుగానీ, ఆపదలో ఉంటే 100కి ఫోన్ చేయాలని, లేదా షీ టీంకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతిఒక్కరూ ఫోన్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో మీ ప్రస్తుత లొకేషన్‌ని అందించవచ్చని చెబుతూ యాప్‌పై అవగాహన కల్పించారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలతోపాటు దినపత్రికలు చదవాలన్నారు. ఎవరైనా అక్రమ రవాణా కు భాద్యులైతే వారు చేసిన నేరాన్ని బట్టి ఏడేళ్ల నుండి యావజ్జీవ కారాగార శిక్షగానీ, మరణశిక్షగానీ విధించే అవకాశం ఉందన్నారు.కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, లీగల్ కౌన్సిలర్ వాసంతి, పీవోలు విజరు కుమార్, దుర్గా భవాని, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఏవో మాణిక్యరావు, క్రాఫ్ (ఎన్‌జిఒ) జిల్లా కో-ఆర్డినేటర్ కోలా సమీర్ కుమార్, ట్రాఫ్‌కింగ్ పోలీస్ డిపార్టుమెంట్ ఎఎస్‌ఐలు బేబిరాణి, లకీë, వార్డెన్ శిల్ప తదితరులు పాల్గొన్నారు.










