Oct 14,2023 20:43

మదనపల్లె : సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి వెంకటేశ్వర్లు నాయక్‌

రాయచోటి : మానవ అక్రమ రవాణా మానవాళికి వ్యతిరేకమని ఇది చాలా ప్రమాదకరమని ఎస్‌డిహెచ్‌ఆర్‌ డిగ్రీ కళాశాల చైర్మన్‌ హరినాధరెడ్డి, విఆర్‌డిఎస్‌ సురేంద్రరెడ్డి అన్నారు. శనివారం మూమెంట్‌ ఇండియా, గ్రామ జ్యోతి సొసైటీ వారి సహకారంతో విఆర్‌డిఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ కళాశాలలో 'వాక్‌ ఫర్‌ ఫ్రీడమ్‌' మానవ అక్రమ రవాణా అనేకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచ వ్యాప్తంగా జరిగే మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. దోపిడీ, బలవంతపు శ్రమ, బానిసత్వం, మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు, భిక్షాటన వంటి అనేక రూపాల్లో బాధితులు అక్రమ రవాణా చెయబడుతున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు వ్యాపారం తర్వాత మానవ రవాణా అనేది అతి పెద్ద వ్యవస్థీకత నేరం అన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా వాక్‌ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ రెడప్ప రెడ్డి, లెక్చరర్లు నాయుడు, మహమ్మద్‌, వెంకట రమణ, గుణశేఖర్‌ రెడ్డి, రెడ్డయ్య, రామంజులు, శివ సాయి క్రిష్ణ, జనార్థన్‌ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌ : మూమెంట్‌ ఇండియా సౌజన్యంతో గ్రామజ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో వాక్‌ ఫర్‌ ఫ్రీడమ్‌ కార్యక్రమాన్ని అక్టోబర్‌ 14వ తేదీ స్వేచ్ఛ కోసం నడక అనే బహత్తర సైలెంట్‌ వాక్కును జిఆర్టి హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి న్యాయమూర్తి వెంకటేశ్వర్లు నాయక్‌, ఆర్‌డిఒ మురళి, డిఎస్‌పి కేశప్ప, వన్‌ టౌన్‌ సిఐ మహబూబ్‌ బాషా, గ్రామ జ్యోతి సొసైటీ డైరెక్టర్‌ బి.సుభద్రలు హాజరయ్యారు. వాక్‌ ఫర్‌ ఫ్రీడమ్‌ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని పిల్లలకు అవగాహన కల్పిస్తూ పెద్దఎత్తున చేపట్టిన ర్యాలీని న్యాయమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక జిఆర్టి హైస్కూల్‌ నుండి ప్రారంభమైన ర్యాలీ బెంగళూరు బస్టాండ్‌, టౌన్‌ బ్యాంక్‌ సర్కుల్‌, ఆర్టీసీ బస్టాండ్‌ మీదుగా జడ్పీ హైస్కూల్‌ వరకు కొనసాగింది. కార్యక్రమానికి విశ్వం డిగ్రీ కళాశాల, బి.టి.డిగ్రీ కళాశాల,ఉమెన్స్‌ డిగ్రీ కాలేజ్‌, గుడ్‌ విల్‌ కంప్యూటర్స్‌, జడ్పీ హైస్కూల్‌, వెలుగు పాఠశాల, జిఆర్టి స్కూల్‌ నుండి సుమారు 1200 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఒడి ఆఫ్‌ కామర్స్‌ లక్ష్మీనారాయణ, వై.ఎస్‌.మునిరత్నం, విఎస్‌ఆర్‌ గ్రాండ్‌ సుధాకర్‌ రెడ్డి, వెలుగు ఉదయ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. పీలేరు : మూమెంట్‌ ఇండియా సౌజన్యంతో గ్రామ జ్యోతి సొసైటీ సూచనల మేరకు షీ సంస్థ ఆద్వర్యంలో పీలేరులో వాక్‌ ఫర్‌ ఫ్రీడమ్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వివేకానంద సర్కిల్‌ నుంచి ఆర్‌టిసి బస్టాండు వరకు స్వేచ్ఛ కోసం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో షీ సంస్థ అధ్యక్షులు డాక్టర్‌ పివిస్‌ లక్ష్మీ, న్యాయ సలహా దారులు డాక్టర్‌ రాయల సుధాకర రాయలు, మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాథ్‌ రెడ్డి, విఎస్‌ఎన్‌ సిద్ధార్థ స్కూల్‌ అధినేత్రి వడ్లమూడి మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు. తంబళ్లపల్లి: మూమెంట్‌ ఇండియా వారి సౌజన్యంతో హెల్పింగ్‌ మైండ్స్‌ ఆధ్వర్యంలో వాక్‌ ఫర్‌ ఫ్రీడమ్‌ ర్యాలీ వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ నుండి రాగిమాను వరకు నిర్వహించారు. ర్యాలీని తంబళ్లపల్లె ఎస్‌ఐ రెడ్డప్ప జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో హెల్పింగ్‌ మైండ్స్‌ సభ్యులు సిరాజ్‌, తుపాకుల శివ, నాగేంద్ర, పురుషోత్తం, సాకే ప్రవీణ్‌, కళ్యాణ్‌, బావదీశ్‌, లోకేష్‌, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.