క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు
ప్రజాశక్తి-కొత్తవలస : విద్యార్థుల్లో మానసిక వికాసం పెంపొందించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. కొత్తవలస జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన అండర్-14, 17 ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, పిఎసిఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ, ఎంఇఒలు జి.శ్రీదేవి, బండారు శ్రీనివాసరావు, మండల కోఆర్డినేటర్ ఎం.పాప, హెచ్‌ఎం ఈశ్వరరావు పాల్గొన్నారు.










