ప్రజాశక్తి-అనంతపురం ప్రతి ఒక్కరూ హృదయాన్ని వీలైనంత మంచి ఆలోచనలతో ఉంచుకుని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ప్రభు త్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కెఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మానసిక వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల మానసిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వైద్యనాథ్ ఆధ్వర్యంలో గురువారం ఆసుపత్రిలోని సెంట్రల్ హాలులో మానసిక ఆరోగ్యంపై అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన అందం ముఖాల్లో కాదని, హృదయాల్లో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో దినచర్య ప్రారంశించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.మాణిక్యరావు వైస్ ప్రిన్సిపాళ్లు ఆరేపల్లి శ్రీదేవి, షారోన్ సోనియా, మానసిక శాస్త్ర విభాగాధిపతి వైద్యనాథ్, బయో కెమిస్ట్రీ విభాగాధిపతి దుర్గ, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి శంకర్, అనాటమీ విభాగాధిపతి ఉమా మహేశ్వరరావు, డిప్యూటీ ఆర్‌ఎంఒ హేమలత, సైకియాట్రి డాక్టర్లు శారద, అనిల్‌కుమార్, పి.రవికుమార్, వరదరాజులు, సశాంక్, సాయిపవన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశీనాయుడు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అధ్యాపకులు లక్ష్మీదేవి, మంజులాదేవి, రమాబాయి, మెడికోలు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కెఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు










