Nov 11,2023 00:52
మాట్లాడుతున్న డాక్టర్‌ ఉగ్ర

ప్రజాశక్తి-కనిగిరి: రాష్ట్రంలోని ప్రజలంతా మాకొద్దు బాబోరు ఈ జగన్‌ అంటున్నారని కనిగిరి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. స్థానిక అమరావతి గ్రౌండ్లో నిర్వహించిన ఉరు హేట్‌ జగన్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నవరత్నాలు పేరుతో 13 వేల కోట్లు పేదలకు పంచామని చెప్పుకుంటున్న సీఎం 70 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారని విమర్శించారు. ఎస్‌సి, ఎస్టి, బిసి సబ్‌ ప్లాన్‌ నిధులు గోల్మాల్‌ చేశారని, 14 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు కాజేసి వైసిపి శ్రేణులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. పాడికి ప్రసిద్ధి చెందిన ప్రకాశం జిల్లా పాడి పరిశ్రమను అమూల్‌ సంస్థకు తాకట్టు పెట్టారని అన్నారు. సంపూర్ణ మధ్య నిషేధం, సిపిఎస్‌ రద్దు మరిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్‌ ఫిరోజ్‌, వివిఆర్‌ మనోహర్రావు, చింతలపూడి తిరుపాలు, నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి, బాలు ఓబుల్‌రెడ్డి, తమ్మినేని వెంకట్‌రెడ్డి, బుల్లా బాలబాబు తదితరులు పాల్గొన్నారు.