ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మాజీ వెయిట్ లిఫ్టర్స్‌ను గుర్తిస్తామని, సౌకర్యాల మెరుగుదలకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం పట్టణంలో గత 35 ఏళ్ల క్రితం దేహదారుఢ్యం, మానసకోల్లాసం కోసం ఏర్పాటు చేసుకున్న వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు గతాన్ని నెమరు వేసుకుంటూ అందరూ కలవాలని మాచాని శివకుమార్, ఎంకప్ప, దేవరాజుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని సన్మానించారు. మాజీ వెయిట్ లిఫ్టర్స్ శివకుమార్, ఎంకప్ప, దేవరాజు మాట్లాడారు. గతంలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సహాయ, సహకారాలను అందించారని తెలిపారు. ఎమ్మిగనూరుకు మంచి పేరు, ఖ్యాతిని తీసుకురావాలని తమను ప్రోత్సహించారని చెప్పారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తే ఒక కోచింగ్ సెంటర్‌ను కట్టించి యువతకు అందుబాటులో ఉంచుతామని కోరారు. అనంతరం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడారు. కావాల్సిన స్థలాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తానని తెలిపారు. క్రీడాకారులు, వైస్ ఎంపిపి పోలయ్య, రహీం, నీలకంఠ, లింగ బాయి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఎర్రకోటను సన్మానిస్తున్న క్రీడాకారులు










