మాల్యాద్రి మృతదేహనికి నివాళలర్పిస్తున్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి-ఉలవపాడు :ఉలవపాడు మాజీ ఉపసర్పంచి, సీనియర్ టిడిపి నాయకుడు దగ్గుమాటి మాల్యాద్రి సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. కొల్లూరుపాడు గ్రామం ఎస్సీ కాలనీలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మతి పట్ల మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం, కందు కూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పలువురు మండల నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్యాద్రి మతదేహానికి పూలమాలు వేసి నివాళి అర్పించాచరు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె ఉన్నారు. భార్య స్టాఫ్ నర్స్‌గా పని చేస్తున్నారు.










