ప్రజాశక్తి-యద్దనపూడి: మండల కేంద్రమైన యద్దనపూడి గ్రామంలోని మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు ఘాట్ వద్ద ఆయన వర్ధంతి సందర్భంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ తన పెదనాన్న పేద ప్రజలకు అండగా ఉండేవారని, అదే విధంగా తాము కూడా పేదలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. గ్రామ కూడలిలో ఉన్న హనుమంత రావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యద్దనపూడి మాజీ ఎంపిపిలు గొట్టిపాటి వెంకట సుబ్బయ్య, గొట్టిపాటి రాంబాబు, వైసిపి నాయకుడు గొట్టిపాటి భరత్ కుమార్, నాయకులు మువ్వ రాంబాబు, వెంకటరావు, శ్రీరామమూర్తి, వలేరు బాలకోటేశ్వరరావు, వీరేంద్ర, జాగర్లమూడి సుబ్బారావు, హనుమంతరావు అభిమానులు, రెండు పార్టీల నాయకులు పాల్గొన్నారు.










