Sep 06,2023 20:48

మాట్లాడుతున్న మాజీమంత్రి నారాయణ

మాట్లాడుతున్న మాజీమంత్రి నారాయణ
మాజీ మంత్రి పొంగూరు నారాయణ రివ్యూ
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ల ఐటిడిపి ఇన్‌ఛార్జ్‌ నేతలతో భవిష్యత్తుకి గ్యారంటీ ఔట్‌ రీచ్‌ శిక్షణ తరగతులపై పొంగూరు నారాయణ చర్చించారు. బుధవారం ఆయన ఐటిడిపి ఇన్‌ఛార్జీల నాయకులకు క్షేత్రస్థాయిలో ఎదురౌతున్న సాంకేతిక సమస్యలపై చర్చిలు నిర్వహించి ఆయా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. మండలానికి ఒక రోజు చొప్పున శిక్షణ ఇవ్వాలని సూచించారు. తరగతుల్లో అన్ని రకాల సందేహాలు నివత్తి అయ్యేలా చూడాలని లీడర్లకు సూచించారు. శిక్షణ తరగతులు కోసం పార్లమెంట్‌ కి ఒక మొబైల్‌ ప్రొజెక్టర్‌ అందజేయనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా శిక్షణ తరగతులు పూర్తి చేయాలన్నారు.
ప్రతి నెల రెండవ వారం తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు టిడిపి అమలు చేయనున్న సంక్షేమ పథకాల గురించి కూడా అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరికి టిడిపి మేనిఫెస్టోను చేరవేయలని చెప్పారు.