Oct 22,2023 00:10

ప్రజాశక్తి - పంగులూరు
విజయవాడ నారాయణ విద్యాసంస్థల్లో ఎజీఎంగా పనిచేస్తున్న మండలంలోని జాగర్లమూడివారిపాలెంకు చెందిన జాగర్లమూడి రవిశంకర్ తండ్రి జాగర్లమూడి వెంకట సుబ్బారావు అనారోగ్యంతో ఇటీవల మరణించారు. ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పి నారాయణ జాగర్లమూడివారిపాలెం శనివారం రాత్రి వచ్చి పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. అక్కడికి చేరిన టిడిపి కార్యకర్తలు చంద్రబాబు ఎప్పుడు విడుదలవుతారని నారాయణను అడిగారు. కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని అన్నారు. కేసులో సాక్షాలను చూపించలేకపోతున్నారని అన్నారు. వచ్చేనెల 6, 7తేదీలలో చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. కేవలం కక్ష సాధింపు చర్యగానే కేసు పెట్టారని అన్నారు. దీనివలన చంద్రబాబుకు గాని, పార్టీకి గాని ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. అనంతరం గ్రామంలోని రాములవారి గుడిలోకి వెళ్లి గుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులంతా కమిటీగా ఏర్పడి నిధులు సేకరించి గుడి నిర్మించుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. గ్రామం మొత్తం ఐక్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి మండల మాజీ అధ్యక్షుడు  కుక్కపల్లి ఏడుకొండలు, తెలుగు యువత నాయకులు జాగర్లమూడి పూర్ణచంద్రరావు, జాగర్లమూడివారిపాలెం పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు జాగర్లమూడి ఎలమందరావు, అల్లంనేని బ్రహ్మానందస్వామి, ముప్పవరం మాజీ సర్పంచి రైతు వీరాంజనేయులు, పుష్పరాజు పాల్గొన్నారు.