Jan 30,2023 21:50

డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
ప్రజాశక్తి - కైకలూరు రూరల్‌

మాజీ ఎంఎల్‌ఎ, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జయమంగళ వెంకటరమణకు ప్రమాదం తప్పింది. సోమవారం వ్యక్తిగత పనిపై కారులో భీమవరం వెళ్లి తిరిగి కైకలూరు బయలుదేరారు. ఈ క్రమంలో ఉప్పుటేరు వద్దకు వచ్చేసరికి బొలెరో వాహనం ఢ కొట్టింది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఢ కొట్టిన బొలేరో వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. ఎవ్వరో కావాలనే ఇలా చేసి ఉంటారని జయమంగళ ఆరోపించారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
పెరిగిన గుండె వేగం
ప్రమాద సంఘటనతో జయమంగళ వెంకటరమణ గుండె కొట్టుకునే వేగం పెరిగింది. దీంతో ఆయన వ్యక్తిగత సహాయకుడు జ యమంగళను కైక లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి పలు సూచనలు చేసినట్లు ఆయన మిత్రుడు బలే ఏసురాజు తెలిపారు.