ప్రజాశక్తి-ఆదోనిరూరల్
కర్ణాటక రాష్ట్ర మంత్రి హెచ్‌కె.పాటిల్ స్థానిక మాజీ ఎమ్మెల్యే రామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆషాడమాసం సందర్భంగా మంగళవారం కర్ణాటక మంత్రి హెచ్‌కె.పాటిల్ కుల దైవమైన రేణుక ఎల్లమ్మ కొండమీది గుడిని సందర్శించారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శ్రీమహాయోగి లక్ష్మమ్మ దేవాలయాన్ని దర్శించుకుని, మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య స్వగృహానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. పాటిల్‌ను రామయ్య శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. అనంతరం రామయ్య స్వగృహంలో మంత్రి, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. రాచోటి సుబ్బయ్య, బ్యాంకు సిఇఒ గట్టు మురళీ కుమార్, ఉపాధ్యక్షులు లక్ష్మణయ్య శెట్టి, శ్రీనివాసులు, హుస్సేన్ అహ్మద్, అశ్వత్ నారాయణ, దినకర్ పాటిల్, సురేష్ గుప్త, ప్రభాకర్ రెడ్డి, హనుమంతు రెడ్డి, ఆర్‌ఎంజి.రెడ్డి, అడ్వకేట్ బద్రినాథ్, టి.రవీంద్ర పాల్గొన్నారు.
కర్ణాటక మంత్రిని పూలమాలతో సన్మానిస్తున్న మాజీ ఎమ్మెల్యే










