Oct 27,2022 23:28

దేముడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సిపిఐ నాయకులు

ప్రజాశక్తి- కొయ్యూరు
చింతపల్లి మాజీ శాసనసభ్యులు, కీర్తిశేషులు జి.దేముడు 8వ వర్థంతి కార్యక్రమం కొయ్యూరు మండలం వెలగలపాలెం గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ తదితరులు దేముడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ చింతపల్లి ప్రజలకు దేముడు చేసిన సేవలు మరువలేని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పోట్టిక సత్యనారాయణ, అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు మాకిరెడ్డి రామనాయుడు, గొలుగొండ, కొయ్యూరు మండలాల సిపిఐ కార్యదర్శులు మేక భాస్కరరావు, ఇరవాడ దేముడు పాల్గొన్నారు.