
ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడును బొండపల్లి పోలీసుస్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విజయనగరం నుంచి గజపతినగరం వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. వైసిపి నాయకులు చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో టిడిపి శ్రేణులంతా స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించారు. వైసిపి తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ప్రజలకు కనీసం వాళ్ళ ఇళ్లలో ఉండే స్వేచ్ఛ కూడా లేదా ప్రశ్నించారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈనేపథ్యంలో నాయకులందరినీ నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బండారు బాలాజీ, మండలపార్టీ అధ్యక్షులు కృష్ణ, తెలుగు యువత నాయకులు వేమల చైతన్యబాబు తదితరులు పాల్గొన్నారు.