Oct 07,2023 23:44

ప్రజాశక్తి-కాకినాడ
మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.ఆర్‌ శంకరన్‌ 13వ వర్ధంతి కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్లో శనివారం నిర్వహించారు. శంకరన్‌ విగ్రహానికి సిపిఎం జిల్లా కన్వీనర్‌ మోర్తా రాజశేఖర్‌ అధ్యక్షతన దళిత ఉద్యమ నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ఒక ఐఎఎస్‌ అధికారి దేశ ప్రజలకి నిస్వార్థ సేవలు ఎలాచేయాలో ఎస్‌ఆర్‌.శంకరన్‌ చూసి నేర్చుకోవాలని ప్రస్తుత అధికారులకు సూచించారు. నిరాడంబరమైన జీవితాన్ని గడిపి దళిత, బహుజన, సామాజిక వెనుకబాటుకు గురయిన ప్రజల అభివద్ధి కొరకు ఎస్‌. ఆర్‌ శంకరన్‌ జీవితాంతం నిజాయితీగా కషి చేశారని కొనియాడారు. ఇలాంటి మహనీయుని వర్ధంతిని పురస్కరించుకొని ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయన అందించిన సేవలకు నిజమైన నివాళి అవుతుందన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎస్‌.శ్రీనివాస్‌, దడాల సింహాచలం, కాశీ బాలయ్య, సిఎస్‌ ఆర్‌.ప్రసాద్‌, పివి.సత్యన్నారాయణ, చెక్కల వేణి, అమత తదితరులు పాల్గొన్నారు.