Jul 09,2023 20:43

మాధవరావు దేశాయిని సన్మానిస్తున్న యువకులు

ప్రజాశక్తి - నందవరం
మాధవరావు దేశాయితోనే గ్రామాభివృద్ధి సాధ్యమని, తామంతా ఆయన వెంట ఉంటామని నందవరం ఎస్సీ కాలనీ 14వ వార్డుకు చెందిన యువకులు తెలిపారు. ఆదివారం మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ మాధవరావు దేశాయి స్వగృహంలో దాదాపు 50 మంది యువకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడారు. మాధవరావు పాలనలో గ్రామ, వార్డు సమస్యలు పరిష్కారమయ్యాయని, మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేయాలని కోరారు. అభివృద్ధిలో సహాయం అందించేందుకు తామంతా మాధవరావు వెంట ఉంటామని తెలిపారు. ప్రకాశం, దుబ్బన్న, సలోమా, స్టీఫెన్‌, రంగప్ప, ఎస్సీ కాలనీ యువకులు పాల్గొన్నారు.