
నరసాపురం టౌన్:పట్టణంలోని 4వ వార్డు మాధవాయిపాలెం, పొన్నపల్లిలో గురువారం జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ, పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన స్పందిస్తూ ప్రతి సమస్యనూ పరిష్కరించి నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం అధికారులతో సమీక్షించారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజారోగ్య సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బర్రె వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్, వార్డు కౌన్సిలర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.