ప్రజాశక్తి-మాధవధార : మాధవధార గ్రామ అభివృద్ధికి శ్రీ మాధవ యువజన సమాజం సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని 50వ వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ అన్నారు. శ్రీ మాధవ యువజన సమాజం సర్వసభ్య సమావేశం ఆదివారం మాధవదారలోని భరద్వాజ క్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వావిలపల్లి ప్రసాద్ హాజరై మాట్లాడారు. శ్రీ మాధవ యువజన సమాజం ఆవరణలో త్వరలో నిర్మించనున్న నూతన భవనానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీమాధవ యువజన సమాజం కన్వీనర్ సనపల రామగోపాల్‌రావు మాట్లాడుతూ, శ్రీ మాధవ యువజన సమాజం అభివృద్ధిలో భాగంగా త్వరలో ఐదు అంతస్తుల నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు తెలియజేశారు. మాధవధార గ్రామ ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ నూతన భవన నిర్మాణం వల్ల మాధవ యువజన సమాజానికి ఆదాయం పెరగడంతోపాటు క్రీడాకారులకు, విద్యార్థులకు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల సూచనలు, సలహాలతో మాధవ యువజన సమాజం విధివిధానాలతో నూతన బైలాను త్వరలో రూపొందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాధవ యువజన సమాజం సహాయ కన్వీనర్ పప్పల రామచంద్రరావు, గాయత్రి విద్యామందిర్ నిర్వాహకులు సనపల జగదీశ్వరరావు, వావిలపల్లి వెంకటరావు, ప్రముఖ న్యాయవాది సనపల కరుణ, పేడాడ పాండురంగారావు, నంబాల అశోక్‌బాబు, బొడ్డేపల్లి త్రినాధస్వామి, పైడి వెంకటరమణ, సనపల నారాయణస్వామి, పప్పల శ్రీదేవి, తమ్మినేని పద్మజ, సనపల చిన్న వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.










