Aug 11,2023 00:42

మాట్లాడుతున్న ఏడి

ప్రజాశక్తి-మాడుగుల:మండల కేంద్రంలో గురువారం విజ్ఞాన బడి కార్యక్రమం నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ ద్వారా అమలు అవుతున్న లింగ నిర్దారణ పరీక్షలు, సంపూర్ణ మిశ్రమ దాణా, 1962 అంబులెన్స్‌ సేవలు, సబ్సిడీ పై పశు గ్రాస విత్తనాలు పంపిణీ, టీకాల కార్యక్రమం తదితర విషయాలు పట్ల రైతులకు అవగాహన కల్పించారు. దూడ పెయ్యలలో మరణాల నిర్మూలన, పాల ఉత్పత్తి పెరగడానికి, ఏడాదికి ఒక పెయ్య జన్మించడానికి, చూడి పశువుల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర విషయాలు పట్ల అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో లైవ్‌ స్టాక్‌ అసిస్టెంట్‌ సౌజన్య సిబ్బంది పాల్గొన్నారు.