Mar 14,2023 23:59
ఇంకొల్లులో భూదేవమ్మ మృతదేహానికి నివాళులర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఇంకొల్లుకు చెందిన సిపిఎం సీనియర్‌ నాయకులు మాదల అంజయ్య తల్లి భూదేవమ్మ(89) మంగళవారం మృతిచెందారు. ఆమె మృతి పట్ల బాపట్ల జిల్లా సిపిఎం కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో సిపిఎం జిల్లా నాయకులు వై సిద్దయ్య, పెంట్యాల హనుమంతరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, సీనియర్‌ నాయకులు తలపనేని రామారావు, సిఐటియు నాయకులు ప్రతాప్‌కుమార్‌, మండల పార్టీ కన్వీనర్‌ నాగండ్ల వెంకట్రావు, నాయకులు శంకరయ్య, డేవిడ్‌, హనుమంతరావు తదితరులు ఉన్నారు.