కడప మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. విశ్వనాథరెడ్డి సూచించారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ (స్టెప్) ఆధ్వర్యంలో సోమవారం కడప నగరంలోని సుమన్ కోచింగ్ సెంటర్‌లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎంఫోర్సేమేంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. విశ్వనాధ రెడ్డి మాట్లాడుతూ ఏ డ్రగ్ నైనా వాడకూడని విధంగా వాడితే అది డ్రగ్ ఎబ్యూజ్ కిందకే వస్తుంది అన్నారు. దీని వల్ల ఆరోగ్యం పాడవుతుందని చెప్పారు. కుటుంబ సభులతో ప్రేమానుబంధాలు తగ్గిపోతాయి, ఆర్ధిక ఇబ్బందులు మొదలవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని తెలిపారు. సుమన్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్లయువతకు ఎంతో అవగాహనా కలుగుతుందని తెలిపారు. స్టెప్, మేనేజర్ వి.వి. సుబ్బరాయుడు మాట్లాడుతూ స్టెప్ కార్యాలయంద్వారా యువతకు అవగాహన కలిపించే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి అని తెలిపారు. కార్యక్రమంలో 110 మంది శిక్షణ పొందుతున్న విద్యార్ధులతో పాటు, కోచింగ్ సెంటర్ సిబ్బంది, స్టెప్ సిబ్బంది జి. వి. సుబ్బారావు, జి. నాగ శ్రీను పాల్గొన్నారు.










