
ప్రతిజ్ఞ చేస్తున విద్యార్థులు, పోలీసులు
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:మాదకద్రవ్యాల వినియోగం, రవాణాకు ప్రజలు దూరంగా ఉండాలని నర్సీపట్నం ఏఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. ప్రపంచ మాదకద్రవ్య నివారణ వినియోగ నివారణ దినం సందర్భంగా అధీరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్, కాలేజీల విద్యార్థులతో స్థానిక శ్రీ కన్య కూడలి నుండి అబీద్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అభిద్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేసారు. ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం, రవాణాతో వచ్చే నష్టాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ నమ్మి గణేష్, పట్టణ ఎస్‌ఐ లు గోవిందరావు, ఎస్‌ఈబి ఎస్సై చంద్రశేఖర్ రాజు పాల్గొన్నారు..