Aug 26,2023 18:21

మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కల్పి స్తున్న దశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మాదక ద్రవ్యాలు ప్రాణాలకు ముప్పు తెస్తాయని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిఐ బా లకష్ణ హెచ్చరించారు. తోటపల్లి గూడూరు జిల్లా పరిషత్‌ ఉన్న త పాఠశాలలో శనివారం మాదకద్రవ్యాలతో నెలకొంటున్న దుష్పలితాలపై విద్యార్థులకు అవగాహన జరిగింది. సెబ్‌ సిఐ బాలకష్ణ, ఇన్‌ఛార్జి ఎంఇఒ డి. జయరామానాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. సుధాకర్‌, ఇన్‌ఛార్జి మెడికల్‌ ఆఫీసర్‌ కె. రమేష్‌, మహిళ పోలీసు పి. సింధు తదితరులు పాల్గొన్నారు. సిఐ బాలకష్ణ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన ఉండాలన్నారు. ప్రధానంగా యువత చెడు మార్గంలో తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నట్ల సిఐ బాలకష్ణ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలు వివరించారు. మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న, రవాణా చేసినా క్రయవిక్రయాలు చేపట్టినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అయన హెచ్చరించారు. భవిష్యత్తులో ఉన్నత స్థితికి ఎదగాల్సిన యువత చె డు స్నేహాల కారణంగా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి తమ ప్రాణాలను పోగొట్టుకుం టున్నారని సీఐ బాలకష్ణ ఆవే దన వ్యక్తం చేశారు. ఈ విష యమై విద్యార్థులు అవగాహన ద్వారా యువతలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.