
మంగళగిరి రూరల్ : నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా, దుర్వినియోగంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యా యులకు ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నవ జీవన్ బాల భవన్ ప్రోగ్రాం మేనేజర్ జి.శేఖర్‌బాబు మాట్లా డుతూ మత్తు పదార్ధాల వలన విద్యార్థుల జీవితాలు నాశన మవుతుందని, సరదాగా అలవాటు చేసుకొని చివరకు మత్తు పదార్థాలు లేకుండా ఉండలేని పరిస్థితికి వస్తున్నారని అన్నారు. మత్తు మైకంలో చదువుకు దూరమవుతూ విలు వైన శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాల వ్యసనపరులను గుర్తించి, వారిని సంబంధిత పునరావాస కేంద్రాలకు పంపి చికిత్స ద్వారా వారిని సాధారణస్థితికి తీసుకు రావాలని అన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని ముందుగా గుర్తించి, వారికి అవగాహనా, కౌన్సిలింగ్ ఇచ్చి, డి అడిక్షన్ సెంటర్లకు పంపించాలని అన్నారు. ఈ విషయమై ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా తీసుకొని పనిచేయాలని సూచించారు. అనంతరం నీతోడు మానసిక వికాస కేంద్రం సైకాలజిస్టు జి.అనూష మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా కీడు ఎక్కువగా చేస్తుం దని, వ్యక్తులలో ఒంటరితనం, డిప్రెషన్‌కు సోషల్ మీడియా కారణమవుతోందని, తద్వారా నిద్ర లేమికి దారితీస్తుందని అనేక అధ్యయనాల ద్వారా తెలుస్తోందని అన్నారు. సోషల్ మీడియాతో వచ్చే దుష్ప్రభావాల గురించి చెబుతూ వెనకబడిపోతున్నామనే భయం, ఒంటరితనం, నిరాశ ,ఆందోళన, సైబర్ బెదిరింపులు ఉంటాయని అన్నారు. డీ-అడిక్షన్ చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకొనిరావచ్చని, నూజివీడు మండలం పొనసనిపల్లిలో ఈ చికిత్స అందిం చేందుకు 'నవజీవన్ బాల భవన్ ఏర్పాటు చేసిన బోస్కో డీ-ఎడిక్షన్ సెంటర్ ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి సమస్యలతో ఉన్న విద్యార్థులు, యువత 9490492020 ఫోన్ నం బరులో సంప్రదించాలని అన్నారు. అనంతరం కార్య క్రమంలో మండల విద్యాశాఖాధికారి జి.సత్యనారాయణ మాట్లాడుతూ సరైన అవగాహనతో మాదకద్రవ్యాలను కట్టడి చేయవచ్చు అని, ఈ అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నవజీవన్ బాల భవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నవజీవన్ బాల భవన్ జోనల్ కోఆర్డినేటర్ బి రమేష్, మండల విద్యాశాఖ అధికారి యన్ బాబు, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.