Feb 15,2023 00:01

మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌

ప్రజాశక్తి-మాడుగుల:విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ శాస్త్రి సూచించారు. మంగళవారం కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, మత్తుకు బానిసగా మారి విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోరాదని హితవు పలికారు. ఎక్సైజ్‌ ఎస్‌ఐ హనుమంతు మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం, రవాణా తదితర నేరాలకు చట్టం ప్రకారం పలు శిక్షలకు గురికావాల్సి వస్తుందన్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి 14500కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ జయలక్ష్మి, అధ్యాపకులు రమణమూర్తి, షర్మిల, పైడిరాజు, బి.రాజుచ, ఎల్‌.సులోచన, నారాయణ, రామ కుమార్‌, శిరీష తదితరులు పాల్గొన్నారు.