అవగాహన కల్పిస్తున్న అధికారులు
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్టేషన్ ఆధ్వర్యంలో శనివారం మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా కందుకూరు పట్టణంలోని ప్రతిభ జూనియర్ కాలేజీలో మాధకద్రవ్యలకు వ్యతిరేకం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ ఇంటర్ విద్యార్థులతో పాటు కళాశాల డీన్ వి మనోజ్ కుమార్, ప్రిన్సిపాల్ వెంకారెడ్డి, సిఇఒ జయ ప్రకాష్ నారాయణ, అధ్యాపకులు పాల్గొని తమ సందేశాలిచ్చారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఇన్‌స్పెక్టర్ డి. వెంకటేశ్వర్లు, సిబ్బంది ఎస్. కె. సలీం బాషా, డి. ఎం. సి. రంగన్న పాల్గొన్నారు.










