Oct 15,2022 23:28


ప్రజాశక్తి - అంబాజీపేట
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్ని నియోజకవర్గాలలో గణనీయమైన ఓటు బ్యాంకు కలిగిన మాదిగ, మాదిగ ఉపకులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల మాదిగ అఖిల పక్ష సమావేశం తీవ్రంగా పరిగణించింది. అంబాజీపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ నందు నాయకులు కొల్లి సూర్యారావు అధ్యక్షతన శనివారం పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలో మాదిగ అఖిలపక్ష సమావేశం జరిగింది. పి.గన్నవరం ఎస్‌సి రిజర్వుడు స్థానంలో వివిధ పార్టీలలో సేవలందిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులకే సీటు కేటాయించాలని సమావేశం డిమాండ్‌ చేసింది. అంబేద్కర్‌ రాజ్యాంగ పరంగా కల్పించి రాజకీయ రిజర్వేషన్లు ద్వారా మాదిగలకు సీటు కేటాయించాలని వారు సూచించారు.కార్యక్రమంలో వివిధ పార్టీల దండోరా నాయకులు నేదునూరి వీర్రాజు, పెదపూడి శ్రీనివాస్‌,ఆకుమర్తి ఆశీర్వాదం, ఈతకోట సత్యనారాయణ, తొత్తరమూడి హదయకృష్ణ,దిగుమర్తి చిట్టిబాబు,చేట్ల. రామారావు, ఉందుర్తి నాగబాబు, సవరపు అబ్రహాం తదితరులు పాల్గొన్నారు.