
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసమే ప్రధాని మోఢ మాదిగలను మరోసారి మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ జివి.హర్ష కుమార్ ఆరోపించారు. స్థానికంగా మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగల విశ్వరూపం మహాసభకు మోఢ హాజరయ్యి మాదిగల పక్షాన పోరాడతాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వచ్చే శీతాకాల సమావేశంలో వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగ, ఉపకులాలకు న్యాయం చేస్తామని ప్రకటిస్తారని మాదిగ సోదరులు అంతా ఎదురుచూశారని, అయితే ఎప్పటిలాగే కమిటీ వేస్తానని వారి ఆశలపై నీళ్లు చల్లారనానరు. తాము అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామన్న బిజేపి పాలకులకు 10 ఏళ్ళ సమయం చాలలేదా అని ప్రశ్నించారు. మోఢ ప్రకటనపై విరక్తి చెందిన మాదిగలు బిజేపిని ఓడించాలని తీర్మానం చేసుకున్నారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో ప్రయివేట్ రంగంలో రిజర్వే షన్‌ల కొరకు పోరాడాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో సిఎం జగన్ రిజర్వేషన్‌లు ఎత్తివేస్తున్నారని ఆరోపించారు. ఎస్‌సి రిజర్వేషన్‌లు వర్గీకరణ చేయాలంటే కుల ప్రాతిపదిన కాకుండా, పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని వర్గీకరీస్తేనే నిజమైన అర్హులకు రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయన్నారు. ఎస్‌సిల్లో చైతన్యం తీసుకురావడం కోసం త్వరలో దళిత సింహగర్జన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెరిస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు.