May 16,2023 18:00

మందులు అందజేస్తున్న డాక్టర్‌ అశోక్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్‌
ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన పథకం కింద మండలంలోని మాచుమాన్‌దొడ్డి గ్రామంలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భగా మండల పశువైద్యాధికారి డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మాట్లాడారు. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన పథకం కింద పశుసంవర్థక శాఖ తరుపున పశువులకు చికిత్స, ఉచిత మందులు అందించినట్లు తెలిపారు. పశువులకు వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించి వాటికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని సూచించారు. వాటర్‌షెడ్‌ క్లస్టర్‌ టిఒ గోవిందప్ప, ప్రాజెక్ట్‌ టిఒ శివ, వాటర్‌షెడ్‌ కమిటీ ఛైర్మన్‌ బొడ్డన్న, గోపాలమిత్ర నల్లన్న, యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ పవన్‌ పాల్గొన్నారు.