మాచర్ల: పట్టణంలోని గుంటూరు రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల వైసిపి యువజన విభాగం జోనల్ ఇంచార్జి, వైసిపి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆనందాన్ని ఆహా ్లదాన్ని అందించే ఎగ్జిబిషన్‌ను మాచర్లలో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాచర్ల చిన్న ఏసోబు, మాజీ చైర్మన్ తురక కిషోర్, వార్డు కౌన్సిలర్లు రామిశెట్టి వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్, గట్ల అరుణ కోటిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనయులు పిన్నెల్లి గౌతమ్ రెడ్డి, ఎగ్జిబిషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.










