Oct 06,2023 22:57

నాక్‌ బృందానికి వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - మాచర్ల : స్థానిక కాసు బ్రహ్మనందరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళశాలను నాక్‌ బృందం శుక్రవారం పరిశీలించింది. కాలేజీలోని లైబ్రెరీ, ల్యాబ్‌లను, కంప్యూటర్‌ తదితర విభాగాలను పరిశీలించి ప్రిన్సిపాల్‌ లక్ష్మీకుమారికి పలు సూచనలు చేశారు. పలు అంశాలపై సభ్యులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రిన్సిపాల్‌ వివరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులతో నాక్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌వి కళ్యాంకర్‌, డాక్టర్‌ బిశ్వంభర మిశ్రా, డాక్టర్‌ టిఎం జోసఫ్‌ సమావేశమయ్యారు. పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు, పోలవరం ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజినీరు బుర్రి సుధాకార్‌బాబు మాట్లాడుతూ కళశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కళాశాలకు రూ.15 లక్షల పరికరాలను పూర్వ విద్యార్థులు అందించినట్లు విద్యార్థుళు తెలిపారు. ఇదిలా ఉండగా బృందాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కాలేజీ అభివృద్ధికి సహకారం అందించాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ప్రముఖ నేత్ర వైద్యులు ఎ.రామలింగారెడ్డి, డాక్టరు కమలాహసన్‌రావు, వ్యవసాయ సలహమండలి చైర్మన్‌ కుర్రి సాయిమార్కొండారెడ్డి, ఎంఇఒ వి.నాగయ్య, సీనియర్‌ లెక్చరర్‌ కె.ఆదినారాయణ, విశ్రాంత డిఇఒ జి.రామకృష్ణారావు, విశ్రాంత శాస్త్రవేత్త సత్యనారాయణరెడ్డి, ఇంజినీరు ఎస్‌.రామనాధ్‌,, కె.దుర్గాప్రసాదు పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పారు.