ప్రజాశక్తి -సీలేరు
ఆంధ్ర ఒరిస్సా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లకు ఆర్‌ఎల్‌ఎ (స్టడీకి) పరీక్షలకు అధికారుల నుంచి అనుమతులు మంజూరైనట్లు ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజనీర్ బి.శ్రీధర్ వెల్లడించారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఒక్కొక్క యూనిట్ ఆర్‌ఎల్‌ఏ స్టడీ జరుగుతుందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఒక యూనిట్ స్టడీ పూర్తి కాగా ప్రస్తుతం నాలుగు, ఆరు, రెండు యూనిట్లు స్టడీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు స్టడీ పనులు పూర్తి చేసిన తర్వాత మిగతా యూనిట్లు ఆర్‌ఎల్‌ఏ స్టడీ చేయాలా, వద్దా, అనే విషయం నిర్ణయించవలసి ఉందని చెప్పారు. స్టడీ అనంతరం ఏవైనా యూనిట్లో ఇబ్బందులు ఉంటే పాత టెక్నాలజీ పార్టులు ఇప్పుడు దొరకడం కష్టమని, అందువల్ల యూనిట్లు మరమ్మతులు పూర్తికాక వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి మరింత జాప్యం జరుగుతుందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో నిర్దేశించిన టార్గెట్లు ఏడాది చేరుకోలేని పరిస్థితిలో ఆర్‌ఎల్‌ఏ స్టడీ వద్దని తమ మేనేజ్మెంట్‌కి నివేదిక ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సివిల్ కెకెవి. ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










