ప్రజాశక్తి- సాలూరు : రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం కొనసాగుతోందని డిప్యూటీ సిఎం రాజన్నదొర చెప్పారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. శనివారం వైఎస్‌ఆర్ రైతు దినోత్సవం సందర్భంగా ఎఎంసి గోడౌన్‌లో జిల్లా వ్యాప్తంగా రైతులకు పంటల బీమా కింద మంజూరైన 6.59 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజన్నదొర మాట్లాడుతూ దేశంలో రైతులకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద లేకుండా నియోజకవర్గ స్థాయిలో అగ్రిల్యాబ్‌లను ప్రారంభిం చిన ఘనత సిఎం జగన్‌దేనని చెప్పారు. టిడిపి హయాంలో మూడేళ్లకోసారి పంటల బీమా అందజేసినట్లు చెప్పారు. గతంలో టిడిపి ప్రభుత్వం హయాంలో రైతులకు 3,400 కోట్ల లబ్ధి చేకూరిస్తే, వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లలో 7,800కోట్ల లబ్ధి చేకూర్చిందన్నారు. ఈ సందర్భంగా ఎఎంసి యార్డులో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్‌ని ఆయన ప్రారంభిం చారు. ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా నియమితులైన డివిజి శంకరరావును ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం అభినందిస్తూ శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో జెసి గోవిందరావు, మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, ఎఎంసి చైర్ పర్సన్ దండి అనంతకుమారి, వైస్ ఎంపిపి రెడ్డి సురేష్ పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్ : పార్వతీపురం మార్కెట్ యార్డ్ వద్ద రూ.68.4 లక్షలు నాబార్డు, ఆర్‌కెవివై నిధులతో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ని ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్‌పర్సన్ మరడాన భాగ్యశ్రీ, మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి, జెడ్‌పిటిసి సభ్యులు బలగ రేవతమ్మ, ఎంపిపి మజ్జి శోభారాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ యిండుపూరు గున్నేశ్వరరావు పాల్గొన్నారు.
పాలకొండ రూరల్ : స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రూ.59 లక్షలతో నిర్మించిన అగ్రిల్యాబ్‌ను ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి బొమ్మాళి భాను, నగర పంచాయతీ చైర్‌పర్సన్ యందవ రాధాకుమారి పాల్గొన్నారు.
కురుపాం : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. కురుపాంలో ఎఎంసి యార్డులో వద్ద రూ.92 లక్షలతో నిర్మించిన అగ్రికల్చర్ ల్యాబ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంటలకు వచ్చే తెగుళ్లపై పరిశోధన చేసి వాటి అనుకూలంగా ఎరువులు, పురుగుల మందులు వాడేందుకు నియోజకవర్గానికి ఒకటి అగ్రికల్చర్ ల్యాబ్‌ను నిర్మించి సిఎం జగన్ రైతుల పక్షపాతి అయ్యారని కొనియాడారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎడి నిర్మల జ్యోతి, ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్‌పిటిసి జి.సుజాత, జిల్లా కోఆప్సన్ సభ్యులు షేక్ నిషార్, వైసిపి గ్రీవెన్స్ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు అంధవరపు కోటేశ్వరరావు, అయ్యారక కార్పొరేషన్ డైరెక్టర్ జి.విజయ చంద్రశేఖర్, సర్పంచ్ జి.సుజాత, వైస్ సర్పంచ్ షేక్ ఆదిల్, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ జిలాని, మాజీ ఎంపిపి ఐ.ఇంద్రకుమారి, ఎఎంసి మాజీ చైర్మన్ ఎన్.వెంకటరావు, ఎంపిటిసిలు వి.బంగారనాయుడు, టివిఎస్ స్వామియోజులు, మైనార్టీ నాయకులు షేక్ నూరేళ్ల పాల్గొన్నారు.










