Nov 16,2023 19:45

గ్రామంలో పర్యటిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-కందుకూరు :మండలంలోని కొండికందుకూరు సచివాలయం పరిధిలో ''మా నమ్మకం నువ్వే జగనన్న'' ఎపికి జగనే ఎందుకు కావాలంటే'' కార్యక్రమాన్ని కొండికందుకూరు సర్పంచ్‌ కుమ్మర బ్రహ్మయ్య, కందుకూరు మండల వైసిపి అధ్యక్షుడు గంగవరపు వెంకటరావు, కందుకూరు మండల జెసిఎస్‌ కో-ఆర్డినేటర్‌ చీమల వెంకట రాజాల అధ్యక్షతన ప్రారంభించారు. అనంతరం గహసారధులు, వాలంటీర్లకు ఏర్పాటు చేసిన శిక్షణలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలతో కలసి వైఎస్‌ఆర్‌ సీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు.కందుకూరు మండల లోని కొండికందుకూరు గ్రామ సచివాలయం పరిధిలో సీఎం జగనన్న ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఏమేరకు లబ్ధిపొందింది వారికి తెలియజేసేలా ''సంక్షేమ పథకం బోర్డును ఆవిష్కరించారు. కోవూరు సర్పంచ్‌ ఆవుల మాధవరావు, జి.మేకపాడు సర్పంచ్‌ గూడపాటి బ్రహ్మయ్య, పార్టీ నాయకులు తొట్టెంపూడి శ్రీనివాసరావు, ఇంటూరి మాధవరావు, గోసల వెంకారెడ్డి, అప్పనబోయిన బ్రహ్మయ్య, గుమ్మా శ్రీను, ముప్పాళ్ళ శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, వై.మాల్యాద్రి, బొడపాటి వెంకటేశ్వర్లు, బక్కమంతుల కోటేశ్వరరావు, రాచగర్ల నాగేశ్వరరావు, బొడపాటి మాలకొండయ్య, బక్కమంతుల రామయ్య ఉన్నారు.