ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేయడంతో చదువుకు దూరం కాకుండా మా భవిష్యత్తును కాపాడండి అంటూ విద్యార్థులు బాలల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు ఆధ్వర్యంలో దాసన్నపేట రైతు బజార్ జంక్షన్ నుండి బాబామెట్ట ఎంఇఒ కార్యాలయం వరకు ర్యాలీ నర్విహించారు. ఎంఇఒకు పువ్వును ఇచ్చి 'మా విద్యను, మా భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు కోరారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ పిల్లలే దేశ భ్యవిష్యత్తు అన్నారు. దేశ మొదట ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున బాలల దినోత్సవం దేశ వ్యాప్తంగా జరుపుకుంటు న్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలోనే తగ్గాయని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలో కూడా కొన్ని పాఠశాలలను ఎత్తివేయడం వల్ల చదువుకు దూరమయ్యారని అన్నారు. లక్షలాది మంది పిల్లలకు విద్యను దూరం చేస్తున్న ప్రభుత్వమిది అన్నారు, పిల్లలకు ప్రాధమిక విద్య అందించడం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, కానీ వారి భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడు కుంటోందని అన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కర్రోతు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
నేటి బాలలే రేపటి పౌరులు
విజయనగరంటౌన్ : క్రమ శిక్షణతో పెరిగే నేటి బాలలే రేపటి సమాజానికి మంచి పౌరులు అవుతారని జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు అన్నారు. తన నివాసంలో బాలల దినోత్సవం నిర్వహించారు. పరిసరాల ప్రాంతాలకు చెందిన 300 బాలలు వివిధ రకాల వేషధారణలతో పాల్గొన్నారు.