చూపుల్ని
బ్రతుకుదారుల వైపు
ఆశగా మల్లించాం
కానీ అన్ని దారులూ
ఇంకా మసక, మసకగానే ఉన్నాయి
పాలన పేరుతో
వల్లించిన వాగ్దాన వాగులు
ఎంతకీ పొంగి పొర్లలేదు
ఏదిరించలేని తనమో
నిలదీయలేని నిరక్ష్యరాస్యతా తనమో
ఇంకా తల్లడిల్లుతూనే ఉన్నాం
పేదల బతుకుల్లో
వెలుగుల్ని అయితే నింపలేరు కానీ
ఉన్నవన్నీ కార్పొరేట్ గాళ్లకు కట్టబెట్టడం
ఏ శుభ లాభ సూచికమో ?
ఇప్పుడు అమ్మడానికి.. ఏవీ మిగలట్లేదు
అధికారంతో పెత్తనాన్ని నెత్తికెత్తుకొన్నాక
ఉన్న పరిశ్రమలు అదృశ్యం అవుతున్నాయి
కళ్ల ముందున్న బతుకు ఆనవాళ్లను
కాలకేయులై, హాట్ కేకుల్లా అమ్మజూస్తున్నారు
మనిషికి ఆసరాగా ఉన్న
కొన్ని ఆశల్ని కర్కశంగా కూల్చేస్తున్నారు
నమ్మి మా ఓటు వేలును మీకు అందించాక
అన్యాయంగా విరచకండి
ఉపాధిని అందిస్తున్న పరిశ్రమల్ని
కంత్రీగాళ్ల చేతుల్లో ఉంచి
మా బతుకుల్ని తుంచి అమ్మకండి...!!
మహబూబ్ బాషా చిల్లెం
95020 00415