- వైసీపీ నాయకులు షేక్. మొభీన్ బాష
ప్రజాశక్తి-కోట : రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికి మరెన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని కోట బిట్ 2 ఎంపిటిసి సభ్యులు, సచివాలయం మండల కన్వీనర్ షేక్.మొభీన్ బాష అన్నారు.ఈ సందర్బంగా శనివారం కోట మండలంలోని కర్లపూడి పంచాయతీ,సిద్దవరం పంచాయతీ, కొత్తపట్నం, పలు పంచాయతీల్లో నా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో ఉండే ప్రజలు నుండి అనూహ్య స్పందన రావడం జరిగిందని వైసీపీ నాయకులు అంటున్నారు.అనంతరం షేక్.మొభీన్ బాష మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే జగనన్న అనే విధానాన్ని ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కర్ ను అంటించి వారికీ అవగాహన కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండే పరిపాలన విధానంపై టీడీపీ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు.ఎవరూ ఎన్నీ పన్నాగాలు చేసినా రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం విజయవంతంగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా కర్లపూడి పంచాయతీలో వైసీపీ సీనియర్ నాయకులు, కర్లపూడి సర్పంచ్ భర్త సన్నారెడ్డి. చెంచు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి వారి ఇంటికి నా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ ను అంటించడం జరిగింది.అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీలో మాజీ జెడ్పిటిసి సభ్యులు, కొత్తపట్నం ఉపసర్పంచ్ ఉప్పల.ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ స్టిక్కర్ లను అందజేశారు.ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.










